పాదాచారుల సౌకర్యార్థం హైదరాబాద్లోని మెహదీపట్నంలో 500 మీటర్ల స్టీలు వంతెన ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ టెండర్ బిడ్లు ఆహ్వానించిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. త్వరలోనే వాటి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఇవి పూర్తయితే పాదాచారులు అత్యంత సులభంగా రోడ్డు దాటే వీలుంటుందని పేర్కొన్నారు.
మెహదీపట్నంలో స్టీలు వంతెన ఏర్పాటుకు సన్నాహాలు - స్కైవేస్ పై మంత్రి కేటీఆర్ తాజా ట్వీట్
మెహదీపట్నంలో స్టీలు వంతెన ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. 500 మీటర్ల వంతెన నిర్మాణానికి హెచ్ఎండీఏ టెండర్ బిడ్లు పిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది పూర్తయితే పాదాచారులకు రోడ్డు దాటడం సులభతరం అవుతుందని అన్నారు.
మెహదీపట్నంలో స్టీలు వంతెన ఏర్పాటుకు సన్నాహాలు
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత బస్ షెల్టర్లను అత్యాధునికంగా మార్చబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇదీ చదవండి:అత్యద్భుతం యాదాద్రి పునర్నిర్మాణం... కనులవిందు ఆ కళాఖండం