KTR Tweet on Karnataka CM Siddaramaiah Video : నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా సామాజిక మాధ్యమం వేదికగా కాంగ్రెస్ సర్కార్‌పై ప్రశ్నలు సంధించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడిన ఓ వీడియోలో నెట్టింట వైరల్ కాగా, ఆ వీడియోను కేటీఆర్ రీ పోస్టు చేశారు. తన ఎక్స్ ఖాతా వేదికగా ఆ వీడియోను పోస్టు చేసి కాంగ్రెస్ సర్కారుపై ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట : కేటీఆర్
KTR Questions Congress Govt Over Six Guarantees : ఈ వీడియోలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు డబ్బు లేదంటూ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించినట్టుగా ఉంది. ఉత్తరాంధ్ర నౌ పేరుతో ఉన్న అకౌంట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చినంత మాత్రాన అవన్నీ ఉచితంగా ఇవ్వాలా అని ప్రశ్నించినట్లు కనిపించింది. హామీల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది.
రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ - శాసనసభలో వాడీవే'ఢీ' చర్చ
ఈ వీడియోను రీపోస్టు చేసిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడనుందా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర భవిష్యత్ కూడా ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇలాంటి విపరీత వ్యాఖ్యలు చేసే ముందుహామీల అమలు సాధ్యమవుతుందా కాదా అని కనీస పరిశోధన చేసుకోరా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
CM Siddaramaiah React on KTR Tweet :కేటీఆర్ చేసిన ట్వీట్‌పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు అశ్వత్ నారాయణ, సి.టి. రవి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి ఎడిట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. 2008, 2018లో బీజేపీ వాగ్దానాలను నెరవేర్చలేదనేది వాస్తవమని గుర్తు చేశారు.
CM Siddaramaiah Latest Tweet :2009లో రుణమాఫీపై యడియూరప్ప కించపరిచే వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రుణమాఫీ కోసం తమ వద్ద నోట్లు ముద్రించే యంత్రం లేదన్నారని గుర్తు చేశారు. హామీల అమలు సాధ్యం కాదని గతంలో యడియూరప్ప అంగీకరించారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలివారంలోనే గ్యారంటీ హామీలు అమలు చేసిందని తెలిపారు. మేనిఫెస్టో ఇతర హామీలను నెరవేర్చే పనిలో ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
'సీఎం రేవంత్ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు'
'ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం - తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం'