ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 14న వెల్లడి కానున్నాయి. ఈ విషయాన్ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం రాత్రి ట్విట్టర్లో వెల్లడించారు. జులై 15 లోపు ఇంటర్ ధ్రువపత్రాలు సమర్పించాలన్న షరతుపై పలువురు తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు సీట్లు వచ్చినా.. ఇప్పటి వరకు ఇంటర్ ఫలితాలు రాకపోవడం వల్ల విద్యార్థులు సీట్లు కోల్పోతారని ఓ విద్యార్థి తల్లి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విన్నవించారు. స్పందించిన కేటీఆర్ ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ మంత్రి, కార్యదర్శితో మాట్లాడతానని పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపటికి ఈ నెల 14న ఫలితాలు ఇస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఇప్పుడే చెప్పారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫలితాలను మొదట శనివారం ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనలతో జేఎన్టీయూహెచ్ నిపుణుల పర్యవేక్షణలో తనిఖీ చేయిస్తున్నారు.
ఇంటర్ సప్లి ఫలితాలపై... కేటీఆర్ ట్వీట్ - ఇంటర్ సప్లి ఫలితాలపై
తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు సీట్లు ఇచ్చాయని, అయితే ఇప్పటి వరకు ఇంటర్ ఫలితాలు రాకపోవడం వల్ల సీట్లు కోల్పోతారని ఓ విద్యార్థి తల్లి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విన్నవించారు. స్పందించిన ఆయన ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ మంత్రి, కార్యదర్శితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఇంటర్ సప్లి ఫలితాలపై...కేటీఆర్ ట్విట్
Last Updated : Jul 13, 2019, 7:14 AM IST