తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య: కేటీఆర్‌

KTR Tweet on Group 4: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్​పై మంత్రి కేటీఆర్​ ట్విటర్ వేదికగా స్పందించారు. గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

ktr tweet on Group 4
ktr tweet on Group 4

By

Published : Dec 2, 2022, 10:11 AM IST

KTR Tweet on Group-4: రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో వార్డు అధికారుల నియామకం జరగబోతోందని మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని పేర్కొన్నారు. వార్డు అధికారుల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారిస్తామని చెప్పారు. వార్డు అధికారులకు కౌన్సిలర్లతో మంచి సమన్వయం జరుగుతుందని.. గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో గురువారం గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ శాఖల్లో 9,168 పోస్టులను టీఎస్​పీఎస్సీ భర్తీ చేయనుంది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్​పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. అర్హతలు, ఖాళీలు, వేతనం తదితర వివరాలతో సమగ్ర నోటిఫికేషన్ ఈనెల 23 నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్ సైట్​లో అందుబాటులో ఉంటుందని కమిషన్ కార్యదర్శి తెలిపారు

ABOUT THE AUTHOR

...view details