KTR Tweet On Foxconn : గతంలో కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్ల ఒప్పందానికి మరొక 400మిలియన్ డాలర్లు జోడిస్తూ మొత్తం 550 మిలియన్ డాలర్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రపంచ ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న స్నేహాన్ని గురించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫాక్స్‌కాన్(Foxconn) గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉందంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్(ప్రస్తుతం ఎక్స్) వేదికగా వెల్లడించారు.
ఇరువురు పరస్పర కట్టుబాట్లను అందజేస్తూ ఉంటారని స్పష్టం చేశారు. గతంలో ఉన్న 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో సహా ఇప్పుడు మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తెలంగాణలోకి ఫాక్స్‌కాన్ సంస్థ అడుగుపెడుతోందని మంత్రి కేటీఆర్ ఎక్స్(Twitter)లో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్‌కాన్ సంస్థ సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
"ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉంటుంది. ఇరువురు పరస్పర కట్టుబాట్లను అందజేస్తూ ఉంటాం. గతంలో ఉన్న 150 మిలియన్ డాలర్ల పెట్టుబడితో సహా ఇప్పుడు మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తెలంగాణలోకి ఫాక్స్‌కాన్ సంస్థ అడుగుపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్‌కాన్ సంస్థ సిద్ధంగా ఉంది."- మంత్రి కేటీఆర్, ట్వీట్
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. లక్ష మందికి ఉపాధి..
Foxconn Industry At Kongarkalan In Telangana : ఈ ఏడాది మార్చి నెలలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫాక్స్‌కాన్ పరిశ్రమకు రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల దాదాపు 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివరించారు. ఇలానే ఉంటే మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఆ రాష్ట్రం నుంచి 'ఫాక్స్‌కాన్' ఔట్! ఏ ప్రభావం ఉండదన్న మంత్రి.. కాంగ్రెస్ ఫైర్!
Foxconn Industry In Telangana : ఈ ఏడాది మార్చి3న హోన్ హై ఫాక్స్ కాన్(Hon Hai Fox Conn) ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.. ఫాక్స్‌కాన్ కంపెనీకి మధ్య ఒప్పందం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమ స్థాపనకు మార్గం సుగమయింది. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయి.
KTR tweet on Foxconn plant : తెలంగాణ స్పీడ్.. ఫాక్స్‌కాన్ ప్లాంట్ నిర్మాణ పనులపై కేటీఆర్ ట్వీట్
Foxconn Industry in Telangana : 'ఫాక్స్‌కాన్‌తో 35 వేల మందికి ఉపాధి'