CM KCR Released BRS MLAs List KTR And Kavitha Tweet : వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగంగా ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను.. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ విడుదల చేశారు. 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులకు సీట్ల(BRS MLAs list 2023)ను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు సంబురాల్లో మునిగిపోగా.. టికెట్లు దక్కని అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎక్స్(Twitter) వేదికగా తమ సందేశాన్ని తెలియజేశారు.
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులందరికీ అభినందనలను ట్విటర్ వేదికగా తెలిపారు. సిరిసిల్ల నుంచి మరోసారి అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. కొంత మంది సమర్థ నాయకులకు అవకాశం కల్పించలేకపోయామని వివరించారు. ప్రజా జీవితంలో నిరాశ, నిస్పృహలు ఎదురవుతాయని అన్నారు. టికెట్ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామని ట్విటర్ వేదికగా హామీ ఇచ్చారు.
"ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులందరికీ అభినందనలు. సిరిసిల్ల అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. కొంతమంది సమర్థనాయకులకు అవకాశం కల్పించలేకపోయాం. టికెట్ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తాం."- మంత్రి కేటీఆర్, ట్వీట్
Kavitha Kalvakuntla Tweet : మరోవైపు దమ్మున్న ముఖ్యమంత్రి-ధైర్యం గల ప్రకటన అంటూ ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 119 స్థానాలకు గానూ.. 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధైర్యంగా ప్రకటించారని తెలిపారు. ఇది నిజంగా సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నాయకత్వం, ప్రభావంతమైన పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆమె కొనియాడారు. ఈసారి కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కవిత ట్విటర్ వేదికగా కోరారు.
"దమ్మున్న ముఖ్యమంత్రి - ధైర్యం గల ప్రకటన. తెలంగాణకు ఇది ఉత్సాహకరమైన సమయం. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ గారి ధైర్యవంతమైన నాయకత్వంపై, ప్రభావశీలమైన బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారన్న నమ్మకముంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని వినమ్రంగా కోరుతున్నాము !!" - ఎమ్మెల్సీ కవిత, ట్వీట్