KTR criticized Amit Shah: మునుగోడులో నిర్వహించిన ‘భాజపా సమరభేరి’ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం పాల్గొన్న విషయం తెలిసిందే. మునుగోడు పర్యటనలో భాగంగా తొలుత హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షాకు చెప్పులు అందిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను తెలంగాణ గమనిస్తోందన్న కేటీఆర్ - KTR criticized Amit Shah
KTR criticized Amit Shah అమిత్‌షాకి బండి సంజయ్ చెప్పులు అందిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని కేటీఆర్ తమ ట్విటర్ అకౌంట్లో పోస్టు చేస్తూ దిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను.. దిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుణ్ణి తెలంగాణ గమనిస్తోందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ktr criticized amit shah
దిల్లీ చెప్పులను మోసే గుజరాతీ గులాములను.. దిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుణ్ణి తెలంగాణ గమనిస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గం సిద్దంగా ఉంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: