మేము ఇప్పుడే ఎదుగుతున్నాము. ఆరోగ్యకర వాతావరణంలో పెరిగే హక్కు మాకుంది. మా కోసం ప్లాస్టిక్ వాడకం మానేయరా ప్లీజ్..’’ ఇలా ముద్దు మాటలతో చిన్నారులు చెబితే వినకుండా ఎవరుంటారు? హైదరాబాద్ ఏఎస్‌రావునగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు స్థానిక ఈసీఐఎల్ బస్టాప్ పరిసరాల్లో నిలబడి ప్లాస్టిక్ ముప్పుపై ముద్దుముద్దు మాటలతో వివరించారు. కాలు కదిపి నృత్యం చేస్తూ సమాజహిత సందేశాన్నిచ్చారు.
ముద్దుగా వద్దన్నారు.. కేటీఆర్ మనసు గెలిచారు - ktr tweet on plastic
ప్లాస్టిక్‌పై పెద్దలే కాదు పిల్లలు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వాడి తమకు భవిష్యత్‌లో కష్టలు తేవద్దంటున్నారు చిన్నారులు. ప్లాస్టిక్ అనర్థాలను వివరిస్తూ హైదరాబాద్ ఏస్రావునగర్లో పిల్లలు చేసిన వీడియో ముద్దుగా ఉందంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్
ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసి ‘ఎంత ముద్దుగా ఉన్నారో’ అంటూ ట్వీట్ చేశారు.