తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాధితులందరికీ ఆర్థిక సాయం అందుతుంది' - Ktr tour news

భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి హైదరాబాద్​లోని రామాంతపూర్, బోడుప్పల్​ పరిధిలో ఆయన పర్యటించారు.

'బాధితులందరికీ ఆర్థిక సాయం అందుతుంది'
'బాధితులందరికీ ఆర్థిక సాయం అందుతుంది'

By

Published : Oct 21, 2020, 3:17 PM IST

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని... ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ రామంతపూర్, బోడుప్పల్ ప్రాంతాలలో వరద నీటిలో మునిగి ఉన్న ఇళ్లను పరిశీలించారు.

మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్​రెడ్డిలతో కలిసి పర్యటించారు. బాధితులకు రూ. 10వేల నగదు, నిత్యావసరాలను అందజేశారు. బాధితులందరికీ ఆర్థిక సాయం అందుతుందని ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వరద బాధితుల కోసం పవన్..​ రూ.కోటి విరాళం

ABOUT THE AUTHOR

...view details