తెలంగాణ

telangana

ETV Bharat / state

వాటి వల్లే అభివృద్ధికి ఆటంకం: కేటీఆర్​ - వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్​ పర్యటన

పలు కాలనీల్లో ప్రైవేటు స్థలాలు ఉండడం, కొన్ని స్థలాలు కోర్టుల్లో ఉండడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. తద్వారా నాలా వ్యవస్థ నిర్మించలేక పోయామని చెప్పారు. వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్‌లోని వరద ప్రభావిత కాలనీల్లో మూడో రోజు పర్యటించారు.

KTR tour of flood affected areas in hyderabad
వాటి వల్లే అభివృద్ధికి ఆటంకం: కేటీఆర్​

By

Published : Oct 16, 2020, 4:00 PM IST

హైదరాబాద్‌లోని వరద ప్రభావిత కాలనీల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. బేగంపేట డివిజన్​లోని ప్రకాశ్​ నగర్, బ్రాహ్మణవాడి, మయూర్ మార్గ్​లో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి తిరిగారు. కాలనీవాసులకు సీఎం సహాయనిధి ద్వారా అందిస్తున్న రేషన్‌కిట్లను పంపిణీ చేశారు.

వాటి వల్లే అభివృద్ధికి ఆటంకం: కేటీఆర్​

ప్రైవేట్ స్థలాల వారితో మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థ నిర్మిస్తాం

ప్రస్తుత పరిస్థితులను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్న కేటీఆర్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలనీల్లో ప్రైవేటు స్థలాలు ఉండడం, కొన్ని స్థలాలు కోర్టు కేసుల్లో ఉండడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలిగిందని... తద్వారా నాలా వ్యవస్థ నిర్మించలేక పోయామని అన్నారు. ఎట్టి పరిస్థితిల్లో ప్రవేట్ స్థలాల వారితో మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి ప్రజల సమస్యలు తీర్చుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ముస్లిం బస్తీలో వర్షపు నీరు నిండి గత రెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పటంతో సత్వరమే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మాట్లాడి 50 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయాలన్నారు.

ఇదీ చదవండి:'మహిళల వివాహ కనీస వయసుపై త్వరలోనే నిర్ణయం'

ABOUT THE AUTHOR

...view details