గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రేపు సికింద్రాబాద్లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తెరాస సభ్యత్వ నమోదుపై ఇటీవల కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బోనాల కారణంగా సభ్యత్వం తక్కువగా జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు వివరణ ఇచ్చారు. గ్రేటర్లో సభ్యత్వ నమోదును ఈనెల 10వరకు పొడగించిన కేటీఆర్... వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు సితాఫల్మండిలో జరగనున్న సికింద్రాబాద్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఉపసభాపతి పద్మారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొంటారు.
రేపు సికింద్రాబాద్లో కేటీఆర్ పర్యటన - KTR TOUR IN SECUNDERABAD
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ సికింద్రాబాద్లో పర్యటించనున్నారు. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు.
![రేపు సికింద్రాబాద్లో కేటీఆర్ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4049868-427-4049868-1565012558231.jpg)
రేపు సికింద్రాబాద్లో కేటీఆర్ పర్యటన
TAGGED:
KTR TOUR IN SECUNDERABAD