తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆత్మీయ సమ్మేళనాలను 2 నెలల్లోపు పూర్తి చేయండి: కేటీఆర్‌ - KTR teleconference with BRS leaders

KTR Teleconference with BRS Leaders: బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేసే దిశగా కేటీఆర్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేస్తూ...60 లక్షల మంది పార్టీ శ్రేణులను చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని కేటీఆర్ సూచించారు.

ktr
ktr

By

Published : Mar 12, 2023, 6:41 PM IST

Updated : Mar 12, 2023, 7:34 PM IST

KTR Teleconference with BRS Leaders: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలతో మంత్రి కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వివరించారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి: ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కేటీఆర్ పేర్కొన్నారు. నాయకులందరి మధ్య ఆత్మీయ అనుబంధం బలోపేతం కావాలని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం.. వారితో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకొని ఎమ్మెల్యేలు.. పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని తెలిపారు.

ఆత్మీయ సమ్మేళనాలను 2 నెలల్లోపు పూర్తి చేయాలి: పట్టణాల్లో అయితే ఒక్కో పట్టణం అనే విధంగా, పెద్ద నగరాల్లో అయితే డివిజన్లను కలుపుకుని ఈ సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ తెలిపారు. వీటికి స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను.. కార్పొరేషన్ ఛైర్మన్లను, డీసీసీబీ, డీసీఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలని పేర్కొన్నారు. వీటిని రెండు నెలల్లోపు పూర్తి చేయాలని వివరించారు. ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి.. ఈ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పూర్తి కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు..

జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అన్ని ప్రారంభించుకోవాలి: ఏరోజు ఏ యూనిట్‌లో.. ఎక్కడ అత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారో తేదీలతో సహా వివరాలు అందించాలని కేటీఆర్ చెప్పారు. దీంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయాలు అన్నింటిని ప్రారంభించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి కావాలని వివరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ వెంటనే సిద్ధం చేయాలని అన్నారు. ఈ విషయంలో పార్టీతో సమన్వయం చేసుకొని.. కార్యాలయాల ప్రారంభోత్సవ తేదీలను నిర్ణయించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: బీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కేటీఆర్ నేతలను కోరారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ దిశగా జయంతి ఉత్సవాల కార్యక్రమాలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 25న నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కూడా పలు కార్యక్రమాలను చేపట్టాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:సీఎం కేసీఆర్‌కు అల్సర్... ఏఐజీ ఆస్పత్రి వైద్యపరీక్షల్లో వెల్లడి

కాంగ్రెస్​ నా సమాధి కడుతోంది.. నేను దేశ నిర్మాణం చేస్తున్నా: మోదీ

Last Updated : Mar 12, 2023, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details