KTR, Telangana Elections 2023 Results Live:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితంగా కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు రెండు సార్లు అధికారం ఇచ్చారని అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఊహించినట్లుగా ఫలితాలు రాలేదని అన్నారు. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందుతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని పేర్కొన్నారు.
KTR, Telangana Elections Results 2023 Live : కాంగ్రెస్‌కు గుడ్ లక్ - ఓడిపోయామని బాధగా ఉన్నా - కేటీఆర్ ట్విట్టర్ ట్వీట్
KTR, Telangana Elections 2023 Results Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు రెండు సార్లు అధికారం ఇచ్చారని.. రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మేము ఊహించినట్లుగా ఫలితాలు రాలేదు. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందుతున్నామని ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందుతున్నాము.
![KTR, Telangana Elections Results 2023 Live : కాంగ్రెస్‌కు గుడ్ లక్ - ఓడిపోయామని బాధగా ఉన్నా Telangana assembly election results 2023](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-12-2023/1200-675-20174437-thumbnail-16x9-ktr.jpg)
Published : Dec 3, 2023, 3:58 PM IST
|Updated : Dec 3, 2023, 5:30 PM IST
KTR Tweet on Congress Victory 2023 :మళ్లీ తెలంగాణలో తప్పకుండా తిరిగి పుంజుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను.' అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు సిరిసిల్లలో కేటీఆర్ విజయం సాధించారు. దాదాపు 29వేల మెజార్టీతో ఆయన గెలుపొందారు.
Harish Rao On Telangana Election Result 2023 :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితంగా హరీశ్ రావు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని.. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారన్నారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నాని అన్నారు. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు.