తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్​ - ktr suggest to party leaders in twitter

ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా తెరాస నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటాలని పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ సూచించారు.

ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్​
ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్​

By

Published : Feb 10, 2020, 10:55 AM IST

Updated : Feb 10, 2020, 4:14 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలంతా మొక్కలు నాటి జరుపుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్​లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా జరపాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటి హరితహారం స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి:

దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రీన్​ కవర్​ని పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం మొక్కల పెంపకం పట్ల తన ఇష్టాన్ని చాటుకున్నారని మంత్రి తెలిపారు. అయితే పురపాలక,ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులకు కూడా మొక్కలు నాటాలని కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు. అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లను కూడా ప్రత్యేకంగా కోరారు.

ఇవీ చూడండి:మా కంటే రామోజీ గ్రూప్ తపనే ఎక్కువ: సీఎం విజయన్

Last Updated : Feb 10, 2020, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details