తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: జవహర్​నగర్​లో జీవో 58,59 ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కేటీఆర్​ - ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కేటీఆర్​

KTR Started Sewage Treatment Plant: జవహర్​నగర్​ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని కేటీఆర్​ అన్నారు. ఆరు నెలల క్రితం.. జీవో 58,59 కింద ఉచితంగా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు పంపణీ చేశామని తెలిపారు. పట్టాల పంపిణీకి ముందు మల్కారం చెరువు నీటిని శుద్ధి చేసే ప్లాంట్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

ktr
ktr

By

Published : Apr 15, 2023, 4:30 PM IST

KTR Started Sewage Treatment Plant: హైదరాబాద్​లోని జవహర్​నగర్​లో జీవో 58,59 ద్వారా అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్​.. చేతుల మీదుగా ఆ పంపిణీ జరిగింది. 6 నెలల క్రితం పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన విధంగానే.. ఇప్పుడు పంపిణీ చేశామని ఆనందం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఇక్కడే జవహర్‌నగర్ డంప్ యార్డ్ వద్ద లిచాట్ ట్రీట్మెంట్ ప్లాంట్​ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. గత పాలకులు జవహర్​నగర్​లో అస్తవ్యస్త పద్ధతులతో, ఎటువంటి ప్రణాళిక లేకుండా డంపింగ్ యార్డు నిర్మించి ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేశారని ​ఆరోపించారు. మల్కారం చెరువు నీటి శుద్ధి ప్లాంట్​ను ప్రారంభించిన కేటీఆర్ ఆనంతరం పేదలకు 3,619 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇక్కడి డంపింగ్​ యార్డ్​కు హైదరాబాద్​ మహానగరం నుంచి ప్రతిరోజు ఎనిమిది వేల టన్నుల చెత్త వస్తోందని.. ఇదంతా పెద్ద పెద్ద గుట్టలుగా పేరుకుపోకుండా.. పునర్వినియోగం దిశగా ఈ చెత్తతో 20 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి అయ్యేలా ప్లాంట్​ను ఏర్పాటు చేశామని కేటీఆర్​ వెల్లడించారు.

నాగరిక సమాజం వైపు అడుగులు: చెత్తనంతా ఒక్క జవహర్​నగర్​లో డంప్​ చేయకుండా నగరంలోని పలు చోట్ల డంపింగ్​ యార్డులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. మురుగునీరును రోజుకు 2000 ఎమ్​ఎల్​డీని శుద్ధి చేసి.. భారతదేశంలో హైదరాబాద్​ ఈ ప్రక్రియలో మొదటిస్థానంలో నిలవనుంది. ఈ విషయంలో హైదరాబాద్​ భారతదేశానికే ఆదర్శం కాబోతుంది. నాగరిక సమాజం దిశగా ముందుకు సాగాలని.. భవిష్యత్​​లో జపాన్ తరహాలో.. హైదరాబాద్​లోనూ అండర్​ గ్రౌండ్​ చెత్త పునర్వినియోగ ప్లాంట్లను నెలకొల్పుతామన్నారు.

"మురుగునీరును శుద్ధి చేసే లిచాట్​ ట్రీట్మెంట్​ ప్లాంట్​ను రూ. 250 కోట్లతో మల్కారం చెరువు మీద ఏర్పాటు చేశాము. సంవత్సరంలోపు ఆ చెరువును మొత్తం శుద్ధి చేస్తాము. కిందకు చెడు నీరును పంపించం... శుద్ధి చేసిన మంచినీరును మాత్రమే పంపిస్తాము. దీని వల్ల భూగర్భ జలాలు మంచిగా తయారు అవుతాయి. రూ. 550 కోట్లతో కరెంటును ఉత్పత్తి చేసే ప్లాంట్​ను పెట్టాము. రూ. 250 కోట్లతో చెడు నీరును మంచిగా చేసే ఈ ప్లాంట్​ను పెట్టాము. జవహర్​నగర్​ డంపింగ్​ యార్డులో ఇప్పటికే రూ. 2000 కోట్లను పెట్టుబడి పెట్టామని" మంత్రి కేటీఆర్​ వివరణ ఇచ్చారు.

"జవహర్​నగర్​లో ఈ డంపింగ్​ యార్డును మొదలు పెట్టినప్పుడు హైదరాబాద్​ నుంచి 8వేల మెట్రిక్​ టన్నుల చెత్త వస్తుందని లెక్క వేశారు. అందుకోసమే ఈ ఫ్లాంట్​ను డిజైన్​ చేశాము. తడి చెత్త నుంచి ఎరువును ఉత్పత్తి చేసి.. ఆ ఎరువును అమ్ముతూ ఉన్నాము. పొడి చెత్త నుంచి విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నాము." -కేటీఆర్​, పరిశ్రమ శాఖ మంత్రి

నాగరిక పద్ధతులు మనం నేర్చుకోవాలి: కేటీఆర్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details