ఉద్యమ నాయకుడే... ఉత్తమ పాలకుడవుతాడని నమ్మి మరోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడం హర్షణీయమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు కూడా కేసీఆర్ మీద నమ్మకంతో 16 ఎంపీ స్థానాల్లో గులాబీ పార్టీనే గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిస్తే రాహుల్ గాంధీకి, భాజపా అభ్యర్థులు గెలిస్తే మోదీకి లాభమన్నారు. తెరాస గెలిస్తే మాత్రమే తెలంగాణ గడ్డకు ఉపయోగమని కేటీఆర్ ఉద్ఘాటించారు. కేసీఆర్ సైనికుడిగా తెరాస తరఫున బరిలోకి దిగిన రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఉద్యమ నాయకుడే... ఉత్తమ పాలకుడు: కేటీఆర్ - TRS COMPAIGN
'కేసీఆర్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం అని సర్వేలు చెబుతున్నాయి. ఆయన ఆధ్వర్యంలో తెరాసకు 16 సీట్లు ఇస్తే... మరింత అభివృద్ధి చేసుకోవచ్చు': కేటీఆర్
ఉద్యమ నాయకుడే... ఉత్తమ పాలకుడు: కేటీఆర్
Last Updated : Mar 23, 2019, 11:40 PM IST