ఐదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మోదీ రైతుబందు పథకాన్ని కాపీకొట్టి పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చారని, ఏపీ సీఎం చంద్రబాబు అదే పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చారని ఎద్దేవా చేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు నమూనాగా మారిందని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీరందించేందుకు కేశవాపురం, దేవులమ్మ సాగర్ వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
'తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలి' - KTR
హైదరాబాద్‌లోనూ 24 గంటలపాటు నీరు వచ్చే రోజు రావాలి. అందుకే నగరంలో రెండు రిజర్వాయర్లు నిర్మించే దిశగా పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఐదేళ్లలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం: కేటీఆర్.
'తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలి'