దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమిపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోమని చెప్పారు. దుబ్బాక ఉపఎన్నికలో తమకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన మంత్రి హరీశ్ రావు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రావిర్భావం తర్వాత రాష్ట్రంలో ఆరేళ్లలో ఏ ఎన్నికయినా అనితర సాధ్యమైన విజయాలు సాధించామన్నారు.
'విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము' - కేటీఆర్ లేటెస్ట్ వార్తలు
విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో తమకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము: కేటీఆర్
ఫలితం మేము ఆశించినట్లు రాలేదని..అందరూ గెలుపు కోసమే పనిచేశారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు శిరోధార్యమన్నారు. తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తామని తెలిపారు.
ఇదీ చదవండి:విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు
Last Updated : Nov 10, 2020, 6:08 PM IST