ఉద్యోగ కల్పనపై బహిరంగ చర్చకు సిద్దమన్న కేటీఆర్.. నేడు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్దకు రావాలని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. మంత్రికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.
'బహిరంగ చర్చకు.. కేటీఆర్ గన్‌పార్క్‌కు రావాలి' - ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
ఉద్యోగ కల్పనపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపి.. మళ్లీ బహిరంగ లేఖలు ఎందుకు రాశారని మంత్రి కేటీఆర్‌ను ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద చర్చకు.. మంత్రి కోసం ఎదురు చూస్తామని తెలిపారు.
'బహిరంగ చర్చకు.. కేటీఆర్ గన్‌పార్క్‌కు రావాలి'
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎందుకు జారీ చేయడం లేదు..? అసలు ఖాళీలెన్ని.. వంటి తదితర అంశాలపై చర్చించడానికి నేడు మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్ వద్ద మంత్రి కోసం ఎదురు చూస్తామని శ్రవణ్ తెలిపారు. శాంతియుత చర్చల ద్వారా.. సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:ఉన్నత విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం : దాసోజు శ్రవణ్