ktr on prof jayashankar: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా జయశంకర్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయనతో కలిసి ఉన్నటువంటి ఓ ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్‌తో కలిసి పాల్గొన్న ముఖ్య ఘట్టాలను ట్విటర్ ద్వారా తెలియజేశారు.
ప్రొఫెసర్ జయశంకర్‌తో జ్ఞాపకాలు.. ట్విటర్‌లో పంచుకున్న కేటీఆర్ - ప్రొఫెసర్ జయశంకర్ తాజా వార్తలు
ktr on prof jayashankar: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా జయశంకర్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయనతో కలిసి ఉన్నటువంటి ఓ ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
2009 నవంబర్ 29న అలగునూర్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన సమయంలో హనుమకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లామని తెలిపారు. ఆ రోజున ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు.. తనను అరెస్ట్ చేసి వరంగల్ జైలుకు పంపించారని మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.
రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన వ్యక్తి:రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన చూపిన మార్గం, పాఠాలు, చైతన్యం చిరస్మరణీయని గుర్తు చేశారు. జయశంకర్ ఆశించినట్లుగా స్వయం పాలన సాకారమైందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.