20 years ago KTR Photo: లండన్‌లో 2001లో తాను లండన్‌లో గడిపిన రోజులను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన స్నేహితుడితో ఉన్న ఫొటోలను మధురస్మృతులు పేరిట శుక్రవారం ట్విటర్‌లో జత చేశారు.
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు... బాగుంది అంటూ రిప్లే ఇస్తున్నారు. అప్పట్లోనే డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది హీరోలా ఉన్నారని... కొనియాడారు. ఓ నెటిజన్... 'దొరికేశాడు మాకు హలీవుడ్ హీరో అంటూ...' కామెంట్ పెట్టారు. థాంక్ గాడ్... మీరు సినీమాల్లోకి రాలేదంటూ మరో నెటిజన్ స్పందించారు. కొంతమంది నెటిజన్లు... హ్యాండ్సమ్ హంక్, హీరోగా ట్రై చేయాల్సింది, భవిషత్తు సీఎం మీరే అంటూ... కేటీఆర్కు కామెంట్ పెట్టారు.