తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల కోసం పోరాడిన కుటుంబం మాది.. ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలో సమరయోధులేరీ?

KTR Tweet: ప్రజల కోసం పోరాడిన చరిత్ర తమ కుటుంబానిదని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు భారతీయుడిగా గర్వపడుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన తన తాత స్వాతంత్య్ర సమరయోధుడు కేశవరావుతో ఉన్న ఫోటోను ట్విటర్​లో షేర్ చేశారు.

కేటీఆర్‌
కేటీఆర్‌

By

Published : Sep 4, 2022, 10:43 AM IST

KTR Tweet: ప్రజల కోసం పోరాడిన చరిత్ర తమ కుటుంబానిదని.. అందుకు భారతీయుడిగా, తెలంగాణవాసిగా గర్వపడుతున్నానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ శనివారం ట్విటర్‌లో తెలిపారు. ‘తాత (అమ్మ శోభ వాళ్ల నాన్న) జె.కేశవరావు మా కుటుంబంలో ఒక స్ఫూర్తిదాయక, ఆదర్శవంతమైన వ్యక్తి’ అని పేర్కొంటూ.. ఆయనతో బాల్యంలో తాను, కవిత, సంతోష్‌ దిగిన ఫొటోను ట్వీట్‌ చేశారు. కేశవరావు 1940 చివర్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని.. కేంద్రం ఆయనకు స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు ఇచ్చిందని చెప్పారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుల్లో ఎంత మంది స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. సంబంధం లేని విషయాలు తమవని చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

భాజపా పాలిత రాష్ట్రాల్లోని రేషన్‌ షాపుల వద్ద ‘థ్యాంక్స్‌ టు తెలంగాణ’ బ్యానర్లు పెట్టాలి..

కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూపాయిలోనూ రాష్ట్ర వాటా ఉందని కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. అక్కడి నుంచి రాష్ట్రానికి 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. నిజంగా విశ్వాసం ఉంటే భాజపా పాలిత రాష్ట్రాల్లోని రేషన్‌ దుకాణాల వద్ద ‘తెలంగాణకు కృతజ్ఞతలు’ (థ్యాంక్స్‌ టు తెలంగాణ) అని బ్యానర్లు పెట్టాలని ఆయన కేంద్ర ఆర్థికమంత్రికి సూచించారు.

* భాజపా అధికారంలో ఉన్న కాలంలో గుజరాత్‌లో జరిగిన అభివృద్ధికి మూడురెట్ల వృద్ధిని తెలంగాణ సాధించిందని కేటీఆర్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వైద్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్య చేశారు.

ఇవీ చదవండి:ఆ కలెక్టర్​కు అండగా కేటీఆర్.. కేంద్రమంత్రి తీరు తనను భయపెట్టిందంటూ

దీదీ సర్కారుకు షాక్.. రూ.3500కోట్ల జరిమానా.. ఎందుకంటే

ABOUT THE AUTHOR

...view details