తెలంగాణ

telangana

ETV Bharat / state

వీలైనన్ని ఎక్కువ స్లిప్​ రోడ్లను నిర్మించాలి: కేటీఆర్​

ప్రధాన రహదార్లపై వాహనాల భారాన్ని తగ్గించేలా వీలైనన్ని ఎక్కువ స్లిప్​ రోడ్లను నిర్మించాలని మంత్రి కేటీఆర్​.. జీహెచ్​ఎంసీ అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 55 స్లిప్​ రోడ్లను గుర్తించామని.. వాటికి అవసరమైన భూసేకరణ, నమూనాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

By

Published : Dec 19, 2019, 7:23 PM IST

Updated : Dec 19, 2019, 8:34 PM IST

వీలైనన్ని ఎక్కువ స్లిప్​ రోడ్లను నిర్మించాలి: కేటీఆర్​
వీలైనన్ని ఎక్కువ స్లిప్​ రోడ్లను నిర్మించాలి: కేటీఆర్​

వీలైనన్ని ఎక్కువ స్లిప్​ రోడ్లను నిర్మించాలి: కేటీఆర్​
హైదరాబాద్​లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రధాన రహదార్లపై వాహనాల భారాన్ని తగ్గించేలా వీలైనన్ని ఎక్కువ స్లిప్ రోడ్లను నిర్మించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీని ఆదేశించారు. మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్, అధికారులు, ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

40 రోడ్లకు ప్రణాళిక సిద్ధం

మొదటిదశలో 55 స్లిప్ రోడ్లను గుర్తించామని... అవసరమైన భూసేకరణ, నమూనాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే 40 రోడ్లకు అభివృద్ధి ప్రణాళిక సిద్ధమైందని, 20 రహదారులకు సంబంధించి కేవలం 90 ఆస్తుల సేకరణ పూర్తి చేస్తే నిర్మాణం ప్రారంభించవచ్చని తెలిపారు.

పది కిలోమీటర్ల చొప్పున..

రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతున్నందున పౌరులు సులభంగా గమ్యం చేరేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఎస్సార్డీపీ, సీఆర్ఎంపీ ద్వారా పెద్దఎత్తున మౌలికవసతులు కల్పిస్తున్నామని... కూడళ్లను అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ప్రతి జోన్లో కనీసం పది కిలోమీటర్ల చొప్పున రద్దీగా ఉండే రహదార్ల వెంట ఫుట్ పాత్​లు నిర్మించాలని ఆదేశించారు.

హైదరాబాద్ రహదారి అభివృద్ధి సంస్థ చేపడుతున్న పనుల వివరాలను మంత్రి తెలుసుకున్నారు. నగరంలో ఉన్న హైటెన్షన్ వైర్ల కింద రహదార్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఇవీ చూడండి: జనవరి 2 నుంచి పల్లెప్రగతికి శ్రీకారం

Last Updated : Dec 19, 2019, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details