తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Review on Palamuru Rangareddy Project : రాష్ట్రచరిత్రలో మైలురాయిగా.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం - పాలమూరు రంగారెడ్డి ఎత్తపోతల పథకం

KTR Review on Palamuru Rangareddy Project : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుందని.. మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టు విశిష్టతను తెలిపేలా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16న జరగబోయే ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను.. సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

KTR on Palamuru Rangareddy Project Inauguration
KTR Review on Palamuru Rangareddy Project

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 5:20 PM IST

KTR on Palamuru Rangareddy Project Inauguration :సాగునీటి వసతిలేక పడావుపడ్డ భూములతో.. వలసల జిల్లాగా మారిన ఒకప్పటి పాలమూరు జిల్లా.. నేడు సస్యశ్యామలం కాబోయే సమయం ఆసన్నమైందని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఈ నెల 16న ప్రారంభించబోయే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో.. రైతన్నలకు సాగునీటి కష్టాలు తొలిగిపోనున్నాయన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు(PRLI Project) ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

Palamuru Rangareddy Dry Run Success : 'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం.. తెలంగాణ సాగునీటి రంగంలో మరో కాళేశ్వరం'

రాష్ట్రంలో ప్రాజెక్టు విశిష్టతను తెలిపేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్(KTR) పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను.. అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వివిధ శాఖల అధిపతులు, ఆయా జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు.

Palamuru Rangareddy Lift Irrigation Project :మహబూబ్​నగర్​లో నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో హరితమయం కానుందని.. నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిద్ధం అయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం, కృష్ణా నదిపై పాలమూరు - రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కట్టిందన్న ఆయన.. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తవుతాయని పేర్కొన్నారు.

Niranjan Reddy on Palamuru Rangareddy Project : పాలమూరుకు తీరనున్న కష్టాలు.. త్వరలోనే సాగునీళ్లు

KTR Review on PRLI Inauguration ceremony :కేసీఆర్(KCR) నాయకత్వంలో రాష్ట్రంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులను చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా.. భారతదేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల నిర్మాణం వెనుక 2001 నుంచి తెలంగాణ ప్రజలు కన్న కలలు ఉన్నాయని తెలిపారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు.. ప్రజల కష్టాలను తీర్చనుందన్నారు.

అనేక అడ్డంకులు దాటుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో పూర్తైన ప్రాజెక్టు.. సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా అందిస్తుందని అన్నారు. ఉమ్మడి పాలనలో తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొన్న పాలమూరు వాసుల నీటికష్టాలు తీరనున్నాయని.. 16వ తేదీన ప్రారంభించే ప్రాజెక్టుతో నూతన శోభ రాబోతుందని పేర్కొన్నారు. ఈ శుభ సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్న మంత్రి.. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవ సభ ఉంటుందని చెప్పారు.

CM KCR Review on Palamuru Rangareddy Project : ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్ రన్‌.. ప్రారంభించనున్న కేసీఆర్

KTR at Hyderabad Steel Bridge Opening : '2023లో హ్యాట్రిక్‌ కొట్టి. ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం'

ABOUT THE AUTHOR

...view details