తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Review On Hyderabad Rains : 'భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు.. జీహెచ్‌ఎంసీ సిద్ధంగా ఉండాలి' - హైదరాబాద్‌లో వర్షాలు

KTR Reviews On Hyderabad Rain Situation : రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టుకుంది. హైదరాబాద్‌కు వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచనను చేసింది. ఈనేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ పురపాలక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖ వర్షాలు పడే నాలుగు రోజులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.

KTR
KTR

By

Published : Jul 19, 2023, 5:02 PM IST

Minister KTR Review On Rains In Hyderabad With Officials : హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నానక్‌ రామ్‌ గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో నగరంలో వర్షాలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రెండు, మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో.. నగరపాలక సంస్థ ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

జలమండలి, విద్యుత్‌ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్‌ పోలీస్‌ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని కేటీఆర్‌ నగరపాలక సంస్థకు తెలిపారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని.. సంసిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఈమేరకు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డి వాటరింగ్‌ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు.

Minister KTR Review On Rains : జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వలన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఏడాది ఇబ్బందులు తప్పుతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్షాల వలన ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పని చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

పారిశుద్ధ్య నిర్వహణ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మెరుగు : హైదరాబాద్‌ నగర పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ చర్చించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో మంచి ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. దీంతో సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. భాగ్యనగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాల వలన నగరంలో చెత్త ఉత్పత్తి పెరుగుతుందని.. ఇలా జరగకుండా ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముందుకు వెళ్లాలని సూచించారు.

ఈ సందర్బంగా అధికారులు తమ తక్షణ, స్వల్పకాలిక పారిశుద్ధ్య ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కి వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని.. ఇదే అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, ఆదిశగా పని చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌, జోనల్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details