మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ నగర అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ దృష్టిసారించారు. నగరంలో పచ్చదనం పెంపుదల, పార్కుల అభివృద్ధి, శౌచాలయాల నిర్మాణం, మైదానాల అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులను జోన్ల వారిగా అధికారులతో మంత్రి చర్చించారు. నగరాభివృద్ధి, సుందరీకరణ పనులు జోనల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలోని పార్కుల స్థితిపై సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వాలన్నారు. పార్కుల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష - Ktr Review On Ghmc
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానగరంగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం అడుగులేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు అనుగుణంగా ఇవాళ నగరంలోని పనుల పురోగతిపై బుద్ధభవన్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫుట్ పాత్‌లు, పార్కులు, క్రీడా మైదానాలను యుద్ధప్రాతిపాదికన అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
![జీహెచ్ఎంసీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష Ktr Review On Ghmc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5927092-128-5927092-1580579822413.jpg)
నగర ప్రజల్లో ఆరోగ్య అంశాల్లో చైతన్యం పెరిగిందని... వాకింగ్‌కు సౌలభ్యంగా ఫుట్‌పాత్‌లను నిర్మించాలన్నారు. పార్కుల నిర్వహణకు దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నామని... దాన్ని రూ.50 కోట్లకు పెంచే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. నగరంలోని 1100 మైదానాల్లో రెండు నెలల్లో విద్యుద్దీపాలు, టాయిలెట్ల సదుపాయాలు, వాలీబాల్, ఫుట్‌బాల్, షటిల్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పచ్చదనాన్ని పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించుటకై అర్బన్ ఆర్ట్స్ ఫోరం, కౌన్సిల్‌ను నెలకోల్పనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
TAGGED:
Ktr Review On Ghmc