KTR Review on 2BHK Second Phase Distribution :ఈ నెల 21వ తేదీన రెండో విడతలో హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. రెండో దశలో దాదాపు మరో 13,300 ఇళ్లను పేదలకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
KTR on Double Bedroom Houses :ఈ సమావేశంలో మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నామని.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదని మంత్రి కేటీఆర్తెలిపారు.
అవినీతి అక్రమాలకు తావులేకుండా అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదని.. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక పూర్తిస్థాయి బాధ్యతను అధికారులకే అప్పగించిందన్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదేనని.. తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచర్చించారు.