తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Review Meeting on Double Bed Room Houses : 'ఐదు దశల్లో డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పంపిణి.. వచ్చే వారంలో మొదటి దశ ప్రారంభం'

KTR Review Meeting on Double Bed Room Houses : వచ్చే వారంలో తొలి దశ ఇల్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్నదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఆ పని వేగవంతంగా జరుగుతుందని అన్నారు. 70 వేల ఇళ్లు పంపిణీని.. ఐదారు దశలో పూర్తి చేయనున్నారని స్పష్టం చేశారు.

By

Published : Aug 16, 2023, 3:58 PM IST

KTR Latest Review Meeting
KTR Meeting on Double Bed Room Houses

KTR Review Meeting on Double Bed Room Houses: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్​లో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణం, పంపిణీ సంబంధిత అంశాలపై మంత్రి ప్రగతిభవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నగరానికి చెందిన మంత్రులు తలసాని, సబిత, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఉపసభాపతి పద్మారావుగౌడ్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

CM KCR Independence Day Speech at Golconda Fort : ఇళ్ల పంపిణీ విషయమై స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికే 70వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని వివరించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ (Beneficiaries Verification) పక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిపారు. రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీపై పలు సూచనలు, సలహాలు మంత్రులు చేశారు. నగర ప్రజలు ఇళ్ల పంపిణీ విషయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు.

KTR Review on GHMC : 'త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ'

Double Bed Room Houses Beneficiaries in GHMC Range: లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి అర్హులను గుర్తిస్తోందని వివరించారు. అర్హులైన లబ్ధిదారులందరికి కేటాయించనున్న ఇళ్ల వద్దే అప్పగించేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని మంత్రులు సూచించారు. గృహలక్ష్మి పథకానికి(Gruha Laxmi Scheme) సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సమావేశంలో చర్చించారు.

Next Week Start to Distribute Double Bed Room Houses in TS : జీహెచ్ఎంసీలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొన్న ప్రభుత్వం వాటిని వేగంగా పూర్తి చేస్తుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. అందులో ఇప్పటికే 75 వేలకు పైగా నిర్మాణం పూర్తయిందని చెప్పారు. సుమారు 4500కు పైగా ఇళ్లను ఇన్​సిట్యూ లబ్దిదారులకు అందించారని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సుమారు 70 వేల గృహాల(70 Thousand Houses)ను ఐదారు దశల్లో వేగంగా అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే వారంలోనే డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పంపిణీ మొదటి దశ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు కేటీఆర్ఆదేశించారు. ఇళ్ల పంపిణీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని సూచించారు.

KTR on Independence Day Celebration : 'మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి'

KTR Tour in Kamareddy : కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన

Minister KTR Vemulawada Tour Today : ఆగేదే లే.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో వేములవాడలో బిజీబిజీగా గడిపిన కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details