కుమురం భీం జిల్లాలో అటవీశాఖ అధికారిణి అనితపై దాడిని తెరాస అధినాయకత్వం తీవ్రంగా పరిగణించింది. దాడి ఘటనపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్‌లో స్పందించారు. కోనేరు కృష్ణారావు చేసిన పనిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. కృష్ణారావుపై ఇప్పటికే కేసు నమోదైందని... అరెస్టు చేశామని వివరణ ఇచ్చారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ట్వీట్ చేశారు.
అటవీశాఖ అధికారిణిపై దాడిని ఖండించిన కేటీఆర్ - dadi
కుమురం భీం జిల్లాలో అటవీశాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిని కేటీఆర్ ఖండించారు. విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ట్విటర్‌లో ట్వీట్ చేశారు.
![అటవీశాఖ అధికారిణిపై దాడిని ఖండించిన కేటీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3706666-625-3706666-1561896177682.jpg)
అటవీశాఖ అధికారిణి దాడి ఘటనపై స్పందించిన కేటీఆర్