KTR Respond to Election Schedule : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సెంచరీ కొట్టి భారీ విజయం సాధిస్తుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రై.. దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం సృష్టిస్తారని పేర్కొన్నారు. పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానమే ఈ ఎన్నికలను శాసించబోతోదంన్నారు. సమరానికి బీఆర్‌ఎస్ సర్వ సన్నద్ధంగా ఉందని తెలిపారు. యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిందని.. బీజేపీ పోటీకి ముందే కాడి పడేసిందని ఎద్దేవా చేశారు.
KTR Tweet on Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections)కు బీఆర్‌ఎస్ సర్వసన్నద్ధంగా ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(Minister KTR) పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏకపక్షమేనని.. భారీ విజయం బీఆర్‌ఎస్‌దేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు రెండు సార్లు నిండు మనసుతో ఆశీర్వదించారని.. మూడోసారి విజయం తమదేనన్నారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో.. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.
BRS Election Agenda 2023: దక్షిణ భారతంలోనే కేసీఆర్ సరికొత్త అధ్యాయం సృష్టిస్తారని కేటీఆర్ అన్నారు. దక్షత గల నాయకత్వానికే మరోసారి పట్టం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్ల ప్రగతి తమ పాశుపతాస్త్రమని.. విశ్వసనీయతే విజయ మంత్రమనికేటీఆర్పేర్కొన్నారు. జన నీరాజనంతో గులాబీదే ప్రభంజనమన్న కేటీఆర్.. ప్రతి ఘాతుక ప్రతిపక్షాలకు మళ్లీ పరాభవం తప్పదన్నారు. కేసీఆర్ కెప్టెన్ అని.. అందువల్లే తమ టీంలో హుషారు ఉందన్నారు. తమ మూడో విజయంతో ప్రతిపక్షాలు బేజారవుతాయన్నారు.
KTR Speech At Hanumakonda Public Meeting : 'తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయం'