తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్టార్టప్ ర్యాంకింగ్స్​లో తెలంగాణకు అగ్రస్థానం - పదేళ్ల పటిష్ఠ ఎకో సిస్టంనకు నిదర్శనం' - telangana it got award

KTR Reacts on Telangana Retains State Startup Ranking Of Year : కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన స్టార్టప్ ర్యాంకింగ్స్​లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడంపై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఈ మేరకు స్పందించారు. గడచిన పదేళ్ల కాలంలో నిర్మించిన పటిష్ఠమైన ఎకో సిస్టంనకు ఇదో నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

KTR Reacts on Telangana Retains State Startup Ranking Of Year
Telangana Retains State Startup Ranking Of Year 2022

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 3:46 PM IST

KTR Reacts on Telangana Retains State Startup Ranking Of Year : తెలంగాణకు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. దేశంలో స్టార్టప్​ ర్యాంకింగ్​ల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దిల్లీలో కేంద్ర ప్రభుత్వం అవార్డును అందజేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్టార్టప్ ర్యాంకింగ్స్​లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడంపై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఈ మేరకు స్పందించారు.

సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ - ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్

గడచిన పదేళ్ల కాలంలో నిర్మించిన పటిష్ఠమైన ఎకో సిస్టంనకు ఇదో నిదర్శనమని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్ వ్యవస్థ బలోపేతానికి సహకరించిన భాగస్వామ్యులందరికీ కేటీఆర్ అభినందనలు తెలిపారు. అటు పేదరిక నిర్మూలనలో తెలంగాణ మంచి పని తీరు కనబరిచిందన్న నీతి ఆయోగ్ నివేదికపై(Niti Aayog) కూడా స్పందించిన ఆయన, గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. గడచిన దశాబ్దంలో తెలంగాణ ఎంత మంచి పని తీరు కనబరిచిందో నివేదికలో వివరించినందుకు నీతి ఆయోగ్​కు ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్​ సినిమా ఇంకా మొదలు కాలేదు - అసలు సినిమా ముందుంది : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details