తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశానికి టార్చ్ బేరర్​గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం : కేటీఆర్‌ - కేటీఆర్​ కామెంట్స్​ ఆన్​ సీఎం రేవంత్ రెడ్డి

KTR Presentation on BRS Nine and Half Years Rule : రాష్ట్రంలో బీఆర్ఎస్​ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుబడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్​లో తప్పు జరిగితే సరిచేయమని, ఈ విషయంలో న్యాయ విచారణను స్వాగతిస్తున్నామని తెలిపారు. పాలన చేత కాక శ్వేతపత్రాల పేరిట అభాండాలు వేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్​పై మండిపడ్డారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల సమష్టి సంపద అని టార్చ్ బేరర్ తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వమని స్పష్టం చేశారు.

KTR Presentation on BRS Nine and Half Year Rule
KTR Explain BRS Development in Telangana 2014- 23

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 2:09 PM IST

Updated : Dec 24, 2023, 3:33 PM IST

దేశానికి టార్చ్ బేరర్​గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం కేటీఆర్‌

KTR Presentation on BRS Nine and Half Years Rule: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనపై 'స్వేదపత్రం' పేరుతో మాజీ మంత్రి కేటీఆర్ పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. బీఆర్​ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఖర్చు కంటే సంపద పదుల రెట్లు పెరిగిందని తెలిపారు. పాలన చేత కాక శ్వేతపత్రాల పేరిట అభాండాలు వేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్​పై మండిపడ్డారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల సమష్టి సంపద అని టార్చ్ బేరర్ తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వమని స్పష్టం చేశారు.

KTR on Kaleshwaram Project Issue : కాళేశ్వరం ప్రాజెక్ట్​లో ఒక్క తప్పు జరిగితే మొత్తం ప్రాజెక్ట్​నే తప్పుబడుతున్నారని మండిపడ్డారు. అందులో ఏమైనా పొరపాటులు జరిగితే సరిచేయాలని, ఈ విషయంలో న్యాయ విచారణను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని, తప్పు జరిగితే చర్యలు తీసుకోండని చెప్పారు. భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి కారణం తెలంగాణేనని కేటీఆర్ అన్నారు. తమపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దని ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచమంతా మనల్ని నిందించే పరిస్థితి తీసుకురాకండని కోరారు. కాళేశ్వరం ఫలాలను కాంగ్రెస్‌ పాలకులు కూడా ఎంజాయ్‌ చేస్తారని తెలిపారు. కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని నిరర్ధకం అంటే మూర్ఖత్వమే అవుతుందని హితవు పలికారు.

"హైదరాబాద్ ప్రతిష్ట, బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయవద్దు. పల్లె ప్రగతి కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేశాం. రహదార్ల వెంట ఎక్కడ పచ్చదనం వస్తే అక్కణ్ణుంచి తెలంగాణ అని ట్రక్కు డ్రైవర్లు చెబుతారు. పెరిగిన పచ్చదనం విధ్వంసమా?. మేము కట్టిన సచివాలయంలో మీరు కూర్చున్నారు. సచివాలయాన్ని కూడా నిరర్ధకం అంటే అది నిరర్థకమా? మీరు నిరర్థకమా?. ఉద్యోగులు, పెన్షన్ల కోసం 3.41 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రూ.1,21,294 కోట్లు పట్టణాలపై ఖర్చు పెట్టాం."- కేటీఆర్, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

తెలంగాణకు అస్థిత్వమే కాదు - ఆస్తులు కూడా సృష్టించాం : కేటీఆర్‌

BRS Presentation on KCR Govt Development 2014- 23 :బీఆర్ఎస్​ పాలనలో 1,11,320 కుటుంబాలకు రైతు బీమా నగదు అందిందని కేటీఆర్ తెలిపారు. రైతుల సహజ మరణాలకు కూడా రైతుబీమా వస్తుందన్నారు. నగదు పొందిన రైతు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి(ktr comments on Revanth Reddy) అంటున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. రైతుబీమా వచ్చిన వాటిలో 99.9 శాతం సహజ మరణాలే అని స్పష్టం చేశారు.

KTR on Projects Development in Telangana: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. మిగతా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలో మహిళలను అడిగితే మిషన్ భగీరథ గొప్పతనం తెలుస్తుందని అన్నారు. ఒక్క ఫ్లోరైడ్ ప్రాంతం కూడా లేదని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు. ఈ ఖర్చులను కూ డా నిరర్థకం అంటారా అని ప్రశ్నించారు.

'పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థను మొత్తం పూర్తి చేశాం. 204 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయాలు నిర్మించాం. వడ్డించిన విస్తరిలా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అన్నీ పెట్టాం. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులోని ఒక్క ఆనకట్టకు చిన్న సాంకేతిక లోపం జరిగితే దాన్ని రాద్దాంతం చేస్తున్నారు. ఇంటికే నల్లాల ద్వారా చేరిన నీటికి ఎలా వెల కడతారు?. కాళేశ్వరం ఫలాలను మీరు కూడా కాదనలేరు.' - కేటీఆర్, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదు: కేటీఆర్‌

KTR on Unemployment in Telangana: ప్రతి గెలుపు, ఓటమి లోనూ పాఠాలు ఉంటాయని కేటీఆర్అన్నారు. ఎక్కువ వేతనాలు, ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేక పోయామని విచారం వ్యక్తం చేశారు. ఓటమి తమకు కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తెలిపారు. వంద రోజుల్లో హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగ భృతి(Congress on Unemployment Benefit)పై నాలుక మడత వేశారని మండిపడ్డారు. సుపరిపాలన అందిస్తారా, కక్ష సాధిస్తారా అన్నది వారి ఇష్టమని పేర్కొన్నారు. తాము దేనికైనా సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతి అడుగును నిశితంగా గమనిస్తామని వెల్లడించారు.

'యువత, ఉద్యోగాలు సహా కొన్ని విషయాల్లో తప్పులు ఉన్నాయి, సరిచేసుకుంటాం. పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద పదుల రెట్లు పెరిగింది. పాలన చేత కాక శ్వేతపత్రాల పేరిట అభాండాలు వేస్తున్నారు. టార్చ్ బేరర్ తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం'- కేటీఆర్‌, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

అది శ్వేతపత్రం కాదు - తప్పుడు సమాచార పత్రం : కేటీఆర్

కాంగ్రెస్​ పార్టీ అబద్ధపు హామీల వల్లే బీఆర్​ఎస్​ ఓడిపోయింది - సిద్ధరామయ్యకు కేటీఆర్ కౌంటర్​

Last Updated : Dec 24, 2023, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details