KTR Presentation on BRS Nine and Half Years Rule: ఆర్థిక, ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా భారత రాష్ట్ర సమితి స్వేదపత్రాన్ని విడుదల(KTR Released Sewda patram) చేసింది. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ పాలనను బద్నాం చేసే ప్రయత్నం చేసిందని అన్నారు. ప్రభుత్వం ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పామని పేర్కొన్నారు. కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే స్వేదపత్రం విడుదల చేశామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణకు అస్థిత్వమే కాదు - ఆస్తులు కూడా సృష్టించాం : కేటీఆర్
"ప్రభుత్వం శ్వేతపత్రాల పేరిట అభాండాలు వేస్తున్నారు. పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద రాష్ట్రంలో పదుల రెట్లు అయింది. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల సమష్టి సంపద. ఎక్కువ వేతనాలు, ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేక పోయాము. ఆరు గ్యారెంటీలే కాదు కాంగ్రెస్ 412 హామీలు ఇచ్చింది. వంద రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
KTR Fire on Congress White Paper : పౌర సరఫరాల సంస్థ నిల్వలను పక్కన పెట్టి, లేని అప్పును ఉన్నట్లుగా చూపి సర్కార్ తిమ్మిని బమ్మిని చేస్తుందని కేటీఆర్(KTR Fire on Congress Government) మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అంధకారమైన రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వెలుగులోకి తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్‌ను భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వివరించారు.
రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు : కేటీఆర్