దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొనియాడారు. నకిరేకల్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలు జైకిసాన్ అనే పదాన్ని నినాదంగా మాత్రమే వాడుకున్నాయని... దాన్ని ఓ విధానంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. పార్టీని సమర్థంగా నడపలేకే తమపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
'తెరాసకు ఓటేస్తే తెలంగాణ సమాజానికి లాభం' - KTR PRAISES KCR
"కాంగ్రెస్‌కి ఓటేస్తే.. రాహుల్‌గాంధీకి లాభం! భాజపాకు ఓటేస్తే... మోదీకి లాభం! కానీ తెరాసకు ఓటేస్తే తెలంగాణ సమాజానికి లాభం...!": కేటీఆర్
తెరాసలో భారీ చేరికలు
TAGGED:
KTR PRAISES KCR