KTR PowerPoint Presentation on BRS Governance :ఆర్థిక, ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అందుకు పోటీగా స్వేదపత్రాన్ని విడుదల చేయనుంది. తెలంగాణ భవన్ వేదికగా ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందుకు సంబంధించినపవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి(Telangana Progress) ప్రస్థానం, దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పేరిట స్వేదపత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
BRS Swedapatram Release at Telangana Bhavan : స్వయం పాలన ప్రారంభమైన తొమ్మిదిన్నరేళ్ల అనతి కాలంలోనే కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతతో, యావత్ తెలంగాణ ప్రజలు చెమటోడ్చి సృష్టించిన సంపదపై స్వేదపత్రం విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంది. పగలూ, రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించబోమని కేటీఆర్ పేర్కొన్నారు.
అది శ్వేతపత్రం కాదు - తప్పుడు సమాచార పత్రం : కేటీఆర్
విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్న ఆయన, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు ఒనగూరిన లబ్ది, సృష్టించిన ఆస్తుల వివరాలు, విలువను స్వేదపత్రం ద్వారా వెల్లడించనున్నారు.
ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయంలో తీసుకొచ్చిన మార్పు, వ్యవసాయం(Agriculture) సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల్లో అభద్రతను పోగొట్టి కల్పించిన స్థైర్యం, తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించనున్నారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు స్వేదపత్రం పేరిట శనివారం తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఇబ్బందులపై కార్మిక విభాగం ఆధ్వర్యంలో కమిటీ :రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు(Concern Programs) చేపడుతూ తమ స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు కేసిఆర్ దేశాల మేరకు కమిటీ వేసినట్లు వివరించారు.
ముఖ్యంగా ఆటో డ్రైవర్ల వారి సమస్యలు, వారు, కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఇందుకోసం ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు రూప్ సింగ్, రామ్ బాబు యాదవ్, మారయ్య మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు : కేటీఆర్
'సీఎం రేవంత్ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు'