తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ దృష్టికి ఆర్యవైశ్య కార్పొరేషన్​ ఏర్పాటు అంశం: కేటీఆర్​ - telangana politics

KTR participating in Aryavaishya Atmiya Abhinandana Sabha
కేసీఆర్​ దృష్టికి ఆర్యవైశ్య కార్పొరేషన్​ ఏర్పాటు అంశం: కేటీఆర్​

By

Published : Nov 27, 2020, 1:42 PM IST

Updated : Nov 27, 2020, 3:14 PM IST

13:38 November 27

కేసీఆర్​ దృష్టికి ఆర్యవైశ్య కార్పొరేషన్​ ఏర్పాటు అంశం: కేటీఆర్​

కేసీఆర్​ దృష్టికి ఆర్యవైశ్య కార్పొరేషన్​ ఏర్పాటు అంశం: కేటీఆర్​

ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని.. సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. పీపుల్స్ ప్లాజాలో ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు.  

కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లాగా సీఎం ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ట్రాన్ని ఎవరు ప్రగతి పథంలోముందుకు తీసుకెళ్తున్నారో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.  

రాష్ట్ర రాబడి పెరిగినప్పుడే పేదల సంక్షేమం సాధ్యమన్న కేటీఆర్.. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరగాలన్న, అభివృద్ధి చెందాలన్న శాంతిభద్రతలు ఉండాలని పేర్కొన్నారు.  

హైదరాబాద్​ వస్తున్న భాజపా నేతలకు స్వాగతం పలుకుతున్నట్లు కేటీఆర్ అన్నారు. వరద ముంపునకు గురైనప్పుడు ఒక్కరూ రాలేదని.. ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద సాయం కింద రూ.1300 కోట్ల ఇవ్వాలని కోరితే పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. కర్ణాటక, గుజరాత్‌కు మాత్రం అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారన్నారు. 

ఆరేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల ద్వారా రూ.2.72 లక్షల కోట్లు కట్టామని.. రాష్ట్రానికి మాత్రం కేవలం రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రూపాయి తీసుకుని ఆఠాణా మాత్రమే ఇచ్చారని తెలిపారు.  

నగరంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. మత సామరస్యం దెబ్బతింటే మొదట నష్టపోయేది వ్యాపారులేనన్నారు. మత పిచ్చితో హైదరాబాద్‌ను ఏం చేసుకుంటామని.. భాజపా విధానం విద్వేష నగరమని కేటీఆర్ ఆరోపించారు. అరాచకం కావాలా.. అభివృద్ధి కావాలా.. ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.  

జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పారని కేటీఆర్ అన్నారు. ఎవరి ఖాతాలోనైనా రూ.15 లక్షలు వేశారా.. అని ప్రశ్నించారు. ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొంతమంది పిచ్చిపిచ్చిమాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్ అంటే.. మరొకరు సమాధులు కూలుస్తామంటున్నారని ధ్వజమెత్తారు.  

నగరానికి ఎంతో చేశాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. కర్ఫ్యూలు, కల్లోలాలు వద్దు.. ప్రశాంత హైదరాబాద్‌ కావాలని ఆకాంక్షించారు. ఎవరి నాయకత్వం ఉంటే లాభం జరుగుతుందో ఆలోచించాలని కోరుతున్నానని.. పనిమంతులను ఓటు ద్వారా ఆశీర్వదించాలని అభ్యర్థించారు.  

ఇవీచూడండి:నగర అభివృద్ధిపై ఎప్పుడైనా పార్లమెంట్​లో మాట్లాడారా? : ఎంపీ నామ

Last Updated : Nov 27, 2020, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details