తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2019, 4:29 PM IST

ETV Bharat / state

ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్​లో భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్

హైదరాబాద్​లో ఎంఫసిస్ అనే ఐటీ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులతోపాటు ప్రోత్సాహకరమైన ప్రభుత్వ విధానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని కేటీఆర్​ చెప్పారు.

ఎంఫసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

ఎంఫసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

క్లౌడ్ సర్వీసెస్ అందిస్తోన్న బెంగళూరుకు చెందిన ఎంఫసిస్ అనే ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని హైదరాబాద్​లోని రాయదుర్గంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులు జాతీయ సరాసరి బెంగళూరు కంటే ఎక్కువ వృద్ధితో పెరుగుతున్నాయని ఆయన అన్నారు. టాస్క్ లాంటి సంస్థలతో కలిసి పనిచేయాలని, తద్వారా కంపెనీ భవిష్యత్తులో ల్యాబ్స్​ను హైదరాబాద్​లో స్థాపించవచ్చని తెలిపారు. రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్​లో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. భాగ్యనగరంలో ప్రతిభావంతులైన మానవ వనరులు, ప్రభుత్వ విధానాలు ఉన్నాయని కేటీఆర్​ చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details