KTR online petition to PM Modi: చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్‌టీని తొలిగించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఆన్‌లైన్ పిటిషన్ మెుదలుపెట్టారు. చేనేత కార్మికుల జీవితాలను కాపాడేందుకు, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు చేనేత ఉత్పత్తులపై వస్తుసేవల పన్నుని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ చేంజి డాట్ ఆర్గ్‌లో ఆన్‌లైన్ పిటిషన్ వేశారు.
ఆ ఉత్పత్తులపై GST రద్దు కోరుతూ... కేటీఆర్ ఆన్‌లైన్ పిటిషన్ - ktr latest news
KTR online petition to PM Modi: చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ పోస్టుకార్డులో నరేంద్ర మోదీకి లేఖ రాసిన మంత్రి కేటీఆర్ మరో అడుగు ముందుకు వేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్ మొదలుపెట్టారు. ఈ మేరకు చేంజి డాట్ ఆర్గ్‌లో పిటీషన్ వేశారు. పన్నును పెంచే ఏ చర్య అయినా ఆ రంగానికి మరణ మృదంగం మోగిస్తుందని పేర్కొన్నారు.
KTR
చేనేత రంగం అతిపెద్ద అసంఘటిత రంగాల్లో ఒకటని.. గ్రామీణ, పాక్షిక గ్రామీణ జీవన ఉపాధిలో అంతర్భాగమని మంత్రి అన్నారు. భారతదేశంలో చేనేత రంగం కొవిడ్ మహమ్మారి ప్రభావంతో కొట్టుమిట్టాడుతోందని విచారణ వ్యక్తం చేసిన ఆయన... పన్నును పెంచే ఏ చర్య అయినా ఆ రంగానికి మరణ మృదంగం మోగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి: