KTR on White Paper on Telangana Finance : రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభా వేదికగా శ్వేతపత్రం (White Paper on State Finance) విడుదల చేసింది. ఈ విషయంపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా సర్కార్ వ్యవహరిస్తోందని విపక్షాలు ఆక్షేపించాయి. దెబ్బతిన్న ఆర్థిక రంగం వాస్తవ స్థితిగతులను అందరి ముందు పెట్టే ప్రయత్నమని ప్రభుత్వం పేర్కొంది.
ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి - రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు : సీఎం రేవంత్ రెడ్డి
KTR Says Not White Paper Only White Lies : అయితే దీనిపై బీర్‌ఎస్ నేతలు స్పందించారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, ప్రచార యంత్రం ద్వారా నడిచే తెల్ల అబద్ధాలు, తప్పుడు సమాచారంతో నిండిన పత్రమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రికేటీఆర్ (KTR) ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆరోపించారు. అత్యంత విజయవంతమైన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వారి ఎజెండాకు అనుగుణంగా రాజకీయాలతో ఆర్థిక అంశాలను ముడిపెట్టి, అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
KTR Tweet Today : 'మీరు చెబుతున్నట్లుగా రాష్ట్రం కష్టాల్లో ఉంటే, నూతనంగా ఎన్నికైన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో కొత్త క్యాంపు కార్యాలయానికి ఎందుకు డబ్బు వృధా చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. దిల్లీలో తెలంగాణ భవన్ ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారని? అన్నారు. వంద రోజుల్లో ఆరు హామీల అమలుకు ఎందుకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదని? చెప్పారు. 100 రోజుల నోటీసుకు కౌంట్‌డౌన్ మొదలైంది' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.