KTR on Telangana Diksha Divas celebration: రైతు బంధు కొత్త పథకం కాదని.. కొన్నేళ్లుగా కొనసాగుతున్న పథకమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ పథకానికి నిధులు మంజూరుకు అనుమతి ఇస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. డిసెంబర్ 4న అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో సమావేశమై.. వారి సమస్యలను తెలుసుకుంటానని.. అనంతరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
KTR on Telangana Recruitment: ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్న దీక్షాదివస్ నిర్వహిస్తామని కేటీఆర్(ktr) తెలిపారు. ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్(BRS) నాయకులు అక్కడే సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో రోగులకు సేవ చేసి.. పండ్లు పంపిణీ చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ పోరాటంతోనే మనకు తెలంగాణ సాకారమైందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వీయపాలనే శ్రీరామరక్ష అని సూచించారు.
అధికారంలో వచ్చాక అసైన్డ్ భూములున్న వారికి పట్టాలిస్తాం : కేటీఆర్
KTR on Telangana Job Calendar: రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయని కేటీఆర్తెలిపారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్ నేతలపైనే జరుగుతున్నాయనటం అవాస్తవమని అన్నారు. రైతు బంధు కొత్త పథకం కాదని.. కొన్నేళ్లుగా కొనసాగుతున్న పథకమని చెప్పారు. ఇప్పటికే కొనసాగతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని వివరించారు.
'బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీనే - తల తెగిపడినా దిల్లీ నేతలకు తలవంచం'
KTR comments on Rahul Gandhi: ఈ పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలోనే లేదని కేటీఆర్అన్నారు. 2004 -2014 మధ్య కేవలం 10 వేల ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ(KTR on Telangana Job Recruitment) చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఉద్యోగం చేసిన వ్యక్తి కాదని.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వ్యక్తి కాదని ఆరోపించారు. నిరుద్యోగుల బాధలు వాళ్లకు ఎలా తెలుస్తాయని విమర్శించారు. తాను పరీక్షలు రాశానని.. ఇంటర్వ్యూలకూ హాజరయ్యానని వెల్లడించారు.
'కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే - కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కుమారుడు పుట్టినట్టే'
"కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించింది. ఈ ఏడాది కూడా నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌ను నిర్వహిస్తాం. బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడి వారు అక్కడ దీక్షా దివస్ నిర్వహించాలి. ఆస్పత్రుల్లో రోగులకు సేవలు, పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిస్తున్నా. రేవంత్‌రెడ్డికే బీజేపీపై ప్రేమ ఉంది. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తాం."- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు
ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షాదివస్ వేడుకలు జరుపుతాం కేటీఆర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అస్త్ర సన్యాసం చేశారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని విమర్శించారు. గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని.. నిరుద్యోగుల సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే నిరుద్యోగం - రాజకీయ ఉద్యోగం కోసమే ఆ పార్టీ ఆరాటం : మంత్రి కేటీఆర్