తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణకు కాళేశ్వరం కల్పతరువు - రాజకీయాల కోసం బద్నాం చేయొద్దు : కేటీఆర్ - KTR on Telangana development

KTR on Telangana Development 2014-23 : దేశంలోనే పల్లెల అభివృద్ధిలో తెలంగాణ స్ఫూర్తిగా నిలిచిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చూసి రాష్ట్రానికి 30 అవార్డులు కేంద్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. పట్టణ అభివృద్ధిలోనూ తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని వివరించారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్​లో తొమ్మిదన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

KTR on Telangana Development
KTR on Telangana Development

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 12:41 PM IST

Updated : Nov 23, 2023, 2:10 PM IST

KTR on Telangana Development 2014-23 :తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఉందని మంత్రి కేటీఆర్‌ (Minister KTR) అన్నారు. జీఎస్‌డీపీ అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పేదరికాన్ని అత్యంత తగ్గించిన రాష్ట్రమని చెప్పారు. తెలంగాణ 2014లో తలసరి ఆదాయం రూ.1,24,104.. కానీ 2023లో రూ.3,17,115కు చేరిందని వివరించారు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్​లో తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

'కొత్త సీసాలో పాత సారా లాంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ'

జీఎస్‌డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ

'జీఎస్‌డీపీలో 2014లో రూ.5.05 లక్షల కోట్లు.. 2023లో రూ.13.27 లక్షల కోట్లు. 2014లో పేదరికం 13.18 శాతం.. 2023లో 5.8 శాతం. 2014లో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు.. 2023లో 3.5 కోట్ల టన్నులు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి కోసం రూ.37,000 కోట్లు ఖర్చు చేశాం. మిషన్ భగీరథ ద్వారా 58 లక్షల కుటుంబాలకు నీరు అందిస్తున్నామని' కేటీఆర్‌ వెల్లడించారు.

KTR Presentation on Telangana Development :మిషన్‌ భగీరథను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయనికేటీఆర్‌ వివరించారు. ఈ పథకం స్ఫూర్తితో కేంద్రం కూడా హర్‌ ఘర్‌ జల్‌ పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. మిషన్‌ కాకతీయ ద్వారా 46,000ల చెరువులకు పునరుజ్జీవం తీసుకువచ్చామని చెప్పారు. ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం నిర్మించామని తెలిపారు. కాలువలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామని కేటీఆర్ అన్నారు.

'మాది హైదరాబాద్​ - ఉర్దూ మాట్లాడ్డం మాకు కామన్'

రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దు

'రైతుల ఆదాయం పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. పాడి, పంటపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. కాళేశ్వరాన్ని నాలుగేళ్లలో పూర్తి చేశాం. 45 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా 2 పంటలకు నీరు అందిస్తున్నాం. గృహ అవసరాలు, పరిశ్రమలకు కాళేశ్వరం ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. కాళేశ్వరం సామర్థ్యం 160 టీఎంసీలు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు. కాళేశ్వరంలో 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్‌, 203 కిలోమీటర్ల టన్నెల్‌. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సర్వసాధారణమని' కేటీఆర్‌ వివరించారు.

"ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయి. సాగర్ కట్టిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయి. రెండేళ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీట మునిగాయి. ఇంజినీరింగ్‌ నిర్మాణం లోపం ఉంటే పునరుద్ధరిస్తామని నిర్మాణ సంస్థ చెప్పింది. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దు. కాళేశ్వరాన్ని బద్నాం చేసి రాష్ట్రానికి అప్రతిష్ట పాలు చేయవద్దు. కాళేశ్వరం కామధేను, కల్పతరువు అని దేశంలో ప్రతి ఒక్కరు చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది." - కేటీఆర్‌, మంత్రి

రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం

'పాలమూరు- రంగారెడ్డి ద్వారా 1,226 గ్రామాలు, జంట నగరాలకు తాగునీరు. పాలమూరు ద్వారా పరిశ్రమలకు 0.33 టీఎంసీల నీరు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట్‌, రంగారెడ్డి జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే రాష్ట్రంలో అంధకారం ఉంటుంది. కాంగ్రెస్‌ పవర్‌ ఇస్తే ప్రజల పవర్‌ తీసేస్తారు. కరెంట్‌ కావాలో.. కాంగ్రెస్ కావాలో.. ప్రజలు తెల్చుకోవాలి. గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని' కేటీఆర్‌ తెలిపారు.

దేశ జనాభాలో 3 శాతం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. అటవీ విస్తరణ పెంపులో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని వివరించారు . హరితహరం కింద 273 కోట్ల మొక్కలు నాటామని అన్నారు. పలకతో రండి పట్టాతో వెళ్లండి అనేది కేజీ టు పీజీ విద్య లక్ష్యమని కేటీఆర్ వెల్లడించారు.

పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చాం

"ప్రతి జిల్లాలోనూ మెడికల్ కళాశాల ఏర్పాటు చేశాం. 58 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏర్పాటు చేసిన కళాశాలలు రెండే. బీఆర్ఎస్ పాలనలో 34 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు. రూ.1200 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశాం. దశలవారిగా ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేస్తాం. ప్రపంచ ఐటీ గమ్యస్థానంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం. ఐటీ ఎగుమతులు రూ.57,000 కోట్ల నుంచి 2.41 లక్షల కోట్లకు పెరిగాయి ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని తీసుకెళ్లాం." - కేటీఆర్‌, మంత్రి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి మాట దేవుడెరుగు - 6 నెలలకో సీఎం మారడం పక్కా : మంత్రి కేటీఆర్‌

'పరిగి నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణ నీళ్లు తెప్పిస్తా'

Last Updated : Nov 23, 2023, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details