KTR on September 17th Celebrations Telangana : తెలంగాణ రాష్ట్రం భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్ 17వ తేదీని(KTR on September 17th).. జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ రోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబురంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ వివరించారు.
దీంతో పాటు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సంబురాల్లో.. మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారని కేటీఆర్తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దులుగా తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఇందులో భాగంగానే వినూత్నమైన కార్యక్రమాలతో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ వి(ముక్తి)మోచనదినంపై భాజపా ఫోకస్.. ఏడాది పాటు ఉత్సవాలు..
BRS Plan to Celebrate National Integration Day :అయితే తెలంగాణ అభివృద్ధి పట్ల ఓర్వలేని రాజకీయ పార్టీలు.. ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు సంబురంగా జరుపుకునే జాతీయ సమైక్యతా దినోత్సవంపై కూడా.. కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రతి అంశానికి మతాన్ని జోడించి.. సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు.
ఈ క్రమలోనే 1948 సెప్టెంబర్ 17న ( National Unity Day in Telangana)సువిశాల దేశంలో.. తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు అని కేటీఆర్ గుర్తు చేశారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిన రోజు అని అన్నారు. ఈ సందర్భం అందరికి గుర్తు ఉంటుందని చెప్పారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను సైతం వక్రీకరించి.. తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.