లాక్డౌన్ పొడిగింపు సందర్భంగా ఇవ్వాల్సిన సడలింపులపై అనేక మంది తనకు సూచనలు చేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించబోయే సమావేశంలో వాటి గురించి చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు.
'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం' - KTR_ON_SUGGESTION given by people ON_LOCKDOWN_EXTENSION
నేటి నుంచి లాక్డౌన్ 4.0 ప్రారంభం కాగా... ఈ సమయంలో ఇవ్వాల్సిన సడలింపులపై ప్రజలు చేసిన సూచనలను మంత్రివర్గం పరిగణనలోకి తీసుకుంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు.
'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'
ప్రజలందరి సూచనలను పరిగణనలోకి తీసుకుని సీఎంతో సమీక్షించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. లాక్డౌన్ పొడిగింపు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో చేయాల్సిన సడలింపులను సమీక్షిస్తామని ఆయన ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు
TAGGED:
ప్రజల సలహాలపై కేటీఆర్ ట్వీట్