పేదల కష్టాలు తెలిసిన తానైతేనే అందరి జీవితాల్లో వెలుగు తీసుకోస్తానని చెప్పిన మోదీ ఐదేళ్లలో ఏమీ చేయలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్... మోదీ, రాహుల్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే... దిల్లీ తెలంగాణ గళం వినిపించే నాయకులుండాలని తెలిపారు. కాంగ్రెస్, భాజపా నేతలు అధిష్ఠానం ఏది చెప్తే దానికి తలూపుతారని ఎద్దేవా చేశారు.
ఐదేళ్లలో చాయ్‌వాలా బన్‌గయా చౌకీదార్...! - KTR ON MODI
"నేను చాయ్‌వాలాను. పేదల కష్టాలు తెలిసినోన్ని. అందరినీ గట్టెక్కిస్తానని ఐదేళ్ల ముందు చెప్పిన నరేంద్రమోదీ... ఇప్పుడేమో చౌకీదార్‌నంటూ కొత్త బాణీ మొదలుపెట్టారు. తాత, నాయనమ్మల పేర్లు చెప్పుకుని రాహుల్‌బాబా బయలు దేరారు."--- కేటీఆర్
మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో...
TAGGED:
KTR ON MODI