తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో​ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ - సుల్తాన్​పూర్

వైద్య పరికరాల తయారీలో హైదరాబాద్ కీలక హబ్​గా మారుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.

నగరంలో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ

By

Published : Aug 31, 2019, 11:35 PM IST

Updated : Sep 1, 2019, 5:28 AM IST

హైదరాబాద్ శివారులోని సుల్తాన్​పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో స్టెంట్ల తయారీ సంస్థకు రేపు శంకుస్థాపన జరుగనుందని కేటీఆర్ తెలిపారు. ఆసియాలో అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్​కు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎంటీ ఛైర్మన్ ధీరజ్ లాల్ కొటాడియా, ఎండీ భార్గవ్ కొటాడియా ఈరోజు తెలంగాణ భవన్​లో కేటీఆర్​ను కలిశారు. ఈ సంస్థ ద్వారా సుమారు 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు కేటీఆర్ ట్విట్టర్​లో వివరించారు. దేశంలో వైద్య పరికరాల ఉత్పత్తి సహజంగానే ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందన్నారు. కీలకమైన వైద్య పరికరాల ధర తగ్గేందుకు దోహదపడుతుందని కేటీఆర్ అన్నారు.

Last Updated : Sep 1, 2019, 5:28 AM IST

ABOUT THE AUTHOR

...view details