KTR on Hyderabad Development :బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్(Minister KTR) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో.. ఖైరతాబాద్ బీజేపీ నాయకుడు గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న కేసీఆర్ కిట్, పిల్లలకు అల్పహార పథకం ఉచిత వైద్యం, రైతు బీమా వంటి పథకాలతో.. ప్రజలకు పుట్టుక నుంచి చావు వరకు సంక్షేమ పథకాలు అండగా ఉన్నాయన్నారు.
KTR Attended BRS Activists Meeting at Bikkanur : ఈ ఎన్నికల్లో దిల్లీ దొరలకు గల్లీ ప్రజలకు మధ్య పోరాటం అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ
BRS Election Campaign 2023 : తొమ్మిదిన్నరేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు.. నగర అభివృద్ధి ఏమయితది.? ఎట్లయితది.? అని చాలా మందికి అనుమానాలు ఉండేవని కేటీఆర్ తెలిపారు. కానీ నేడు హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా మారిందని.. భాగ్యనగరంలో ఉంటే అమెరికాలో ఉన్నట్లు ఉందని సినీనటుడు రజినీకాంత్ అన్నారన్నారు. హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని.. బీజేపీ ఎంపీ సన్ని డియోల్ అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి అందరికి కనిపిస్తోంది కానీ.. విపక్షాలకు కనిపించట్లేదని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో కరెంట్, మంచినీరు, సౌకర్యాలు మెరుగుపడ్డాయి. నగరంలో ఈ తొమ్మిదేళ్లలో ఒక్క కర్ఫ్యూ కుడా లేదు. ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఎస్ఆర్డీపీ, ఎస్ఎస్డీపీ కార్యక్రమాలతో రోడ్లు, నాలాలు బాగు చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
Telangana Assembly Elections 2023 : కేసీఆర్ వచ్చాక రేషన్ బియ్యం కోటాను.. ఒక వ్యక్తికి ఆరు కిలోలకు పెంచామని గుర్తు చేశారు. కేసీఆర్ మూడోసారి గెలిచాక ఇంటింటికి వైట్కార్డు ఉన్నవారికి అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం అందిస్తాం. ఆనాడు నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని.. మన్మోహన్ సింగ్‌ను విమర్శించారు. ఈనాడు బీజేపీ పాలనలో గ్యాస్‌బండ సామాన్యులకు గుదిబండగా మారింది. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చాక గ్యాస్‌సిలిండర్‌ను రూ. 400లకే అందిస్తామని.. మహిళలకు ప్రత్యేకంగా సౌభాగ్యలక్ష్మి పేరుతో.. 18 సంవత్సరాలు నిండిన వారందరికి నెలకు రూ. 3000 ఇస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో రాబోయే కాలంలో లక్ష బెడ్రూంలు నిర్మించి ఇస్తామని.. హైదరాబాద్ మెట్రోను నగరం నలుములలా 400 కిమీలకు పెంచుతామని కూడా కేటీఆర్ ప్రకటించారు. ఓటు వేసే సమయంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
"బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారీ అధికారంలోకి రావాలి. లేదంటే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. కాంగ్రెస్ హయాంలోని కరెంట్ కోతలు, మంచి నీటివెతలు మళ్లీ వస్తాయి. కేసీఆర్ వంటి నాయకుణ్ని బ్రహ్మండమైన మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలో రైతుబంధుతోపాటు రైతుబీమా అమలు చేస్తున్నాము. రాబోయే సారీ వ్యవసాయ భూమి లేనివారికి.. రేషన్ కార్డు ఉంటే చాలు కేసీఆర్ బీమా పేరుతో.. బీమా కల్పిస్తాం".- కేటీఆర్, మంత్రి
'సంపద పెంచాలి- పేదలకు పంచాలనేదే కేసీఆర్ సిద్ధాంతం' KTR Counter to DK Shivakumar : హస్తం పార్టీ వైఫల్యాలు చూడటానికి కర్ణాటక వెళ్లాల్సిన అవసరం లేదు : డీకేకు కేటీఆర్ కౌంటర్
KTR Fires on Congress : 'రాహుల్, రేవంత్ లాంటి వాళ్లుంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో..?'