KTR on Dalit Bandhu in Telangana : 65 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రైతుబంధు, దళితబంధు లాంటి ఆలోచనలు ఎందుకు రాలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు చేసిందని గగ్గోలు పెడుతున్న విపక్షాలకు.. తెలంగాణలో విద్యుత్, సాగు, తాగునీటి రంగాల్లో జరిగిన అభివృద్ధి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమానంగా చూస్తూ.. సంపదను పెంచుతూ పేదలకు పంచుతున్నామని స్పష్టం చేశారు.
KTR Latest Comments on Congress : హైదరాబాద్‌లో దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు నిర్వహించిన కార్యక్రమంలో.. మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత్‌లో దళితుల గురించి ఆలోచించింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఓట్ల కోసం దళితబంధు తీసుకురాలేదన్న కేసీఆర్.. ఆ సామాజికవర్గ ప్రజల అభ్యున్నతి కోసమే తెచ్చామని తెలిపారు. దళిత బంధు లాంటి పథకాన్ని 100 శాతం విజయవంతంగా అమలు చేసి చూపెడితే దేశానికే ఓ దిక్సూచి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 65ఏళ్ల పాలనలో కాంగ్రెస్(KTR Comments on Congress)కు దళిత బంధు లాంటి ఆలోచనే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
'కొత్త సీసాలో పాత సారా లాంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ'
"కాంగ్రెస్ నాయకులు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. మా ప్రభుత్వానికి దళితబంధు ఓకేసారి అందరికీ ఇవ్వాలని ఉంటుంది. కానీ నిధులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది కదా. కాంగ్రెస్ 65 ఏళ్ల పాలనలో ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి.. ఒక్కసారైనా దళిత బంధు, రైతు బంధు, 24 గంటలు విద్యుత్ ఆలోచన ఎందుకు రాలేదు? ఇలాంటి అంశాలు గుర్తుకు రావు కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం వచ్చు." - కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి