తెలంగాణ

telangana

ETV Bharat / state

దావోస్​లో కేటీఆర్​ బిజీ.. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు - ktr davos tour latest news

దావోస్​లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​... ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీల సీఈవోలు, ఉపాధ్యక్షులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వారికి వివరించారు.

ktr met many industrialists in davos tour
దావోస్​లో కేటీఆర్​ బిజీ.. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు

By

Published : Jan 24, 2020, 5:02 AM IST

Updated : Jan 24, 2020, 7:29 AM IST

దావోస్​లో కేటీఆర్​ బిజీ.. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్​ వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ మూడో రోజూ బీజీగా గడిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల ప్రముఖులతో సమావేశమయ్యారు.

సౌదీ సమాచార శాఖ మంత్రి అబ్దుల్లా ఆల్ స్వాహతో కేటీఆర్​ భేటీ అయ్యారు. హైదరాబాద్​లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల పరిశీలనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రతోనూ కేటీఆర్​ సమావేశమయ్యారు.

డెన్మార్క్​కు చెందిన మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ.. నోవో నోర్ డిస్క్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు క్యమీల సిల్వెస్తోను కలిశారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్), బయో ఆసియా భాగస్వామ్యాలపై చర్చించారు. మైక్రాన్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ మహోత్రతోనూ సమావేశమయ్యారు.

కోకో కోలా కంపెనీ సీఈవో జేమ్స్ క్వెన్సి, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్విక్కితో కేటీఆర్​ భేటీ అయ్యారు. హైదరాబాద్ తమకు అత్యంత ప్రాధాన్య ప్రాంతమని వొజ్విక్కి..​ కేటీఆర్​తో అన్నారు. అనంతరం ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సనొఫి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్​లోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లో లైఫ్ సైన్స్ ఫార్మా రంగ ఈకో సిస్టం, డిజిటల్ డిస్కవరీ రంగంలో వస్తున్న వినూత్నమైన ట్రెండ్స్, ఫార్మా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అనేక అంశాలపై చర్చించారు.

దక్షిణ కొరియాకు చెందిన ఎస్​ఎంఈ, స్టార్టప్ శాఖల మంత్రి యంగ్​ సున్​తో కేటీఆర్​ సమావేశమయ్యారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు మైఖేల్ పుంకేతో తెలంగాణ పెవిలియన్​లో భేటీ ఆయ్యారు. సాఫ్ట్ బ్యాంక్​ సీనియర్ మేనేజింగ్ పాట్నర్​ దీప్​నిషార్ మంత్రిని కలిశారు. నెస్లే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాన్సన్​తో సమావేశమైన మంత్రి.. తెలంగాణలో వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో చేపట్టిన చర్యలను, పుడ్​ ప్రొసెసింగ్​ రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు.

ఇవీచూడండి: దావోస్​లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం

Last Updated : Jan 24, 2020, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details