KTR Meeting with War Room Incharges : ఎన్నికల సన్నదతలో భాగంగా.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అన్ని రకాలుగా సమాయత్తం అవ్వడం కోసం.. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల వార్‌రూమ్‌లు ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తెలిపారు. వార్‌రూమ్‌లో ప్రతినిధులతో హైదరాబాద్‌లోని జలవిహార్‌లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టో, ప్రచారాస్త్రాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేటీఆర్, హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు.
KTR Discussion on Election Campaign : కేంద్ర ఎన్నికల కార్యాలయంతో ఎలా పనిచేయాలి, ఎన్నికల ప్రచారంలో ప్రతి రోజు ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాలపై కేటీఆర్ చర్చించారు. ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.. తదితర విషయాల గురించి మాట్లాడారు. ప్రజల్లో బీఆర్ఎస్పై నమ్మకం ఉందని.. 119 నియోజకవర్గాల ఇన్చార్జ్లు, వార్ రూమ్ ప్రతినిధులు తెలిపారు. గత రెండు రోజుల్లో ముడు సర్వే రిపోర్ట్లు బయటకి వచ్చాయని.. వాటన్నింటిలో బీఆర్ఎస్కి 70కి పైగా స్థానాలు వస్తాయని గుర్తు చేశారు. కేసీఆర్(KCR) మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని సర్వే ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. సానుకూలంగా ఉన్న ప్రజల్ని.. బీఆర్ఎస్(BRS) ఓటుగా ఎలా మలచాలి.. ఎలాంటి పద్దతులు అవలింభించాలని చర్చించుకున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
KTR Comments on Congress and BJP : బీజేపీ మొదటి ఎన్నికల జాబితాలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి(Kishan Reddy)కి సీటు దక్కలేదని.. ఎన్నికల రణరంగంలో వెన్నుచూపి పారిపోయారని విమర్శించారు. 119 స్థానాల్లో దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులే లేరని ఆరోపించారు. అలానే కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాల్లో లేరని అన్నారు. సంస్కారం గురించి కాంగ్రెస్(Congress) నుంచి నేర్చుకునే అవసరం తమకు లేదని.. వారే నేర్చుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్య స్థితిలో ఉందని.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అమ్ముకునే స్థాయికి దిగజారిందని ఆరోపించారు. హస్తం పార్టీ నాయకులు తమ అధ్యక్షుడు సీట్లు కోసం డబ్బులు వసూలు చేస్తున్నాడని.. ఈడీకి పిర్యాదు చేస్తున్నారని అన్నారు.