తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపోరులో తెరాస విజయం కోసం కేటీఆర్​ కసరత్తు - తెరాస విజయం

మున్సిపల్​ ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ... ఎమ్మెల్యేలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కమిటీలతో తెలంగాణ భవన్​లో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

KTR_MEETING_WITH_PARLIAMENT CONSTITUENCY_LEVEL LEADERS AT TRS BHAVAN

By

Published : Sep 11, 2019, 9:39 PM IST

Updated : Sep 12, 2019, 7:29 AM IST

పురపోరులో తెరాస విజయం కోసం కేటీఆర్​ కసరత్తు

మున్సిపాల్టీ ఎన్నికల్లో తెరాస విజయం కోసం పార్టీ శ్రేణులతో సమన్వయంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సూచించారు. త్వరలో తెరాస జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాల్టీ ఎన్నికల సన్నద్ధత కోసం పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఏర్పాటు చేసిన పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కమిటీలతో తెలంగాణభవన్​లో సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు నియోజకవర్గాల వారీగా నివేదికలు సమర్పించారు. తెరాసకే విజయం వరిస్తుందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల అంతర్గత విబేధాలు నష్టం కలిగించవచ్చునని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నివేదికల్లో కమిటీ సభ్యులు సూచించినట్లు సమాచారం.

త్వరలో విస్తృత స్థాయి సమావేశం....

త్వరలో తెరాస విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీగా ఉన్న తెరాసను మరింత బలోపేతం చేసేందుకు కార్యచరణ రూపొందిస్తామన్నారు. సంస్థాగత బలంతో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని తెలిపారు. రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా తెలంగాణ భవన్​కు వచ్చిన కేటీఆర్​కు... పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

Last Updated : Sep 12, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details